
– ప్రణవ్ నివాసంలో నాయకులను, కార్యకర్తలు కలిసిన నేతలు
– కాంగ్రెస్ మయమైన హుజూరాబాద్ ప్రధాన చౌరస్తాలు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజా జనహిత రెండవ విడత పాదయాత్ర కార్యకర్తల్లో మంచి జోష్ నింపింది. చొప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకొని వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గానికి వెళ్ళే క్రమంలో హుజూరాబాద్ మండలం సింగాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో ఏఐసిసి తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఇతర ముఖ్య నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. సింగపూర్ పంచాయతీ కార్యాలయం నుండి ప్రణవ్ నివాసానికి ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఆయన నివాసంలో అల్పాహారం తీసుకొని, కార్యకర్తలకు అభివాదం చేశారు. అగ్ర నాయకుల పర్యటనతో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ నింపింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చేలా కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలకు వారు ఈ సందర్భంగా సుచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, బ్లాక్ కాంగ్రెస్, బీసీ, ఎస్సీ, మైనారిటి, యువజన, ఎన్ఎస్యూఐ, సేవాదళ్, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ కండువా కప్పి స్వాగతం పలుకుతున్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్, దొంత రమేష్ తదితరులు..

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కు స్వాగతం పలుకుతున్న ప్రణవ్..

సింగపూర్ లోని ప్రణవ్ నివాసానికి వచ్చి వివరాలను అడిగి తెలుసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్..

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ కు గజమాలతో, మహారాజా టోపీ పెట్టి స్వాగతం పలుకుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు..





