
– అధికారులు తక్షణమే వరద ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించాలి.
– అధికారులతో నేరుగా ఫోన్ లో సంభాషించిన ప్రణవ్.
– కాలనీల్లో వరద పరిస్థితి, వర్షాలపై ఆరా
– అవసరమైతే తప్ప బయటికి ఎవరు వెళ్లకూడదు.
– వినాయక మండపాల వద్ద జాగ్రత్తగా ఉండండి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాలపై అధికారులు దృష్టిసారించాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సూచించారు. ఈ మేరకు గురువారం ఉదయం 2 పట్టణాల కమిషనర్లు, వివిధ మండలాల అధికారులతో ఫోన్ లో ఆయన మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత వరకు వరద నీరు నిలవకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు వినాయక మండపాల వద్ద నిర్వాహకులు జాగ్రత్తగా వ్యవహరించాలని, కరెంట్ స్తంభాలు ఇతరత్ర సరి చూసుకోవాలనీ, రైతులు కరెంట్ పెట్టే సమయంలో చూసుకోవాలని కోరారు. వాతావరణ అధికారుల సూచన మేరకు మరో మూడు రోజులు భారీ వర్షాల నేపధ్యంలో అవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటికి ఎవరు రాకూడదని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు కూడా తగిన సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని కోరారు.

ఫోన్ ద్వారా అధికారులను వివరాలను అడిగి తెలుసుకుంటున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..





