
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వరద ముప్పు పెరగడంతో బాధిత ప్రాంతాలకు ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యం అవుతున్న విషయమై కేంద్ర మంత్రి బండి సంజయ్ రక్షణ శాఖ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇప్పటికే మూడు హెలికాప్టర్లు రెడీగా ఉన్నాయని, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల చాపర్ల రాక ఆలస్యం అవుతోందని, ప్రత్యామ్నాయ స్టేషన్లైన నాందెడ్, బీదర్ నుండి పంపే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ… భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తోందని, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. కేంద్రం తరఫున పూర్తి సహకారం అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే నిమగ్నమయ్యాయని వెల్లడించారు. “వీలైనంత త్వరగా చాపర్లను పంపాలని కోరాను” అని మంత్రి తెలిపారు.

రక్షణశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడుతున్న కేంద్రమంత్రి బండి సంజయ్..





