
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన వేల్పుగొండ పవన్ (29) అనే యువకుడు పెళ్లి కావడం లేదని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పవన్ కు పెళ్లి కావడం లేదని బాధపడేవాడని మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య చేసుకున్న వేల్పుకొండ పవన్ (ఫైల్ ఫోటో)





