
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఆగస్టు 29: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ బృందానికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇంటి నిర్మాణానికి హౌస్ నెంబర్ ఇవ్వాలంటే 20 వేల రూపాయలు లంచం కావాలని బాధితుడిని డిమాండ్ చేశాడు. వెంటనే బాధితుడు ఏసీబీ అధికారులని ఆశ్రయించడంతో, డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శిపై ఉచ్చుపన్నిన ఏసీబీ బృందం డబ్బులు స్వీకరిస్తున్న సమయంలోనే దాడి చేసి అరెస్టు చేసింది.
“లంచం అడిగినా వెంటనే ఫిర్యాదు చేయండి” – ఏసీబీ
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 నెంబర్‌కి సమాచారం అందించాలి. ఫిర్యాదు దారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. కార్యదర్శి నాగరాజు గతంలో మంజూరు చేసిన ఇంటి నెంబర్లకు సంబంధించి, పర్మిషన్ల గురించి పూర్తి విచారణ జరిపించడం జరుగుతుందని తెలిపారు.
గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు
కార్యదర్శి నాగరాజు ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకొని ఆయన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎసిబి అధికారులు నాగరాజుకు సంబంధించిన వివరాలు చెబుతున్నప్పుడు కూడా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే కార్యదర్శి నాగరాజు గ్రామస్తులను ఎంత పెద్ద ఎత్తున వేధింపులకు గురిచేసాడు అర్థం చేసుకోవచ్చని పలువురు గుసగుసలాడడం కోసం మెరుపు.

రూ. 20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన కార్యదర్శి నాగరాజు

వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ కరీంనగర్ డిఎస్పి విజయ్ కుమార్…





