
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక): వీణవంక మండల కేంద్రానికి చెందిన కంజుల స్వరూప ఇటీవల మృతి చెందింది. కాగా విషయం తెలుసుకున్న కరీంనగర్ జిల్లా సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి సగర తదితర నాయకులు శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ కుటుంబానికి 50 కేజీల బియ్యం, నూనె ప్యాకెట్లు అందజేశారు. వారి వెంట సగర సంఘం నాయకులు బొడిపెల్లి కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.

స్వరూప కుటుంబ సభ్యులను పరామర్శించి బియ్యం అందజేస్తున్న సగర సంఘ నాయకులు..





