
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: మానకొండూర్ ఎంఎల్ఏ, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కీ.శే.రాజేశం ఇటీవలే మృతి చెందగా శుక్రవారం నగర శివారులోని లక్ష్మీనరసింహా గార్డన్లో వారి కుటుంబ సభ్యులు నిర్వహించిన రాజేశం పెద్ద కర్మ కార్యక్రమంలో ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు పాల్గొని మృతుని చిత్ర పటానికి పూలు చల్లి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను, ఎంఎల్ఏ కవ్వంపల్లి సత్యనారాయణను నాయకులతో కలిసి పోలాడి పరామర్శించారు.
కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, కవ్వంల్లి శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో తరలి వచ్చి కవ్వంపల్లి సత్యనారాయణ ను పరామర్శించారు.

ఎమ్మెల్యే కవ్వంపల్లిని పరామర్శిస్తున్న ప్రజా సంఘాల నాయకుడు పోలాడి రామారావు..





