
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను బిఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుందని పలువురు బిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపాన్ని బిఆర్ఎస్ నాయకులు కాలేశ్వరం జలాలతో శుభ్రం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ…రైతులకు కావలసిన యూరియా అందించలేని కాంగ్రెస్ అసమర్ధ ప్రభుత్వ చర్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. యూరియా కోసం రైతులు ప్రతిరోజు వివిధ ప్రాంతాల్లో ఆరిగోసలు పడుతున్నారని అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకులకు వారి బాధలు కనిపించడం లేదన్నారు. రైతుల బాధలు కనిపించని ప్రభుత్వాన్ని ప్రజలు దించే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఎరువుల దుకాణాలను సందర్శించి రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు బండ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందె రాధిక, మండల అధ్యక్షులు సంఘం ఐలయ్య, సామాజిక సహాయకర్త
వర్థినేని రవీందర్ రావు, మాజీ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముక్క రమేష్, కేసిరెడ్డి లావణ్య, నాయకులు కట్కూరి మల్లారెడ్డి, ఎండి ఇమ్రాన్, పంజాల శ్రీధర్ గౌడ్, కెక్కెర్ల సారయ్య గౌడ్,
తిరుపతి, కొండ్ర నరేష్, ముషం తిరుపతి, యాదగిరి, ఎండి ఇసాక్, తులసి లక్ష్మణమూర్తి, దిల్ శ్రీనివాస్, నాటుకోళ్ల రాజయ్య, బండ సాయి తదితరులు పాల్గొన్నారు.



కాలేశ్వరం జలాలతో అమరవీరుల స్థూపానికి శుద్ధి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు

ఫర్టిలైజర్ షాప్ దగ్గర ఎరువుల, యురియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు
————–+++++++++——————-
##పత్రికా ప్రకటనలు&&
————-++++++++——————-
##వార్షికోత్సవ శుభాకాంక్షలు##






