
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన పాత పెన్షన్ పునరుద్దరణ అమలు పరుస్తాం అనే వాగ్దానాన్ని ప్రభుత్వాలను ఏర్పాటు చేసాక తుంగలో తొక్కి దాని స్థానంలో యూనిఫైడ్ పెన్షన్ అనే కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చి ఉద్యోగులను మభ్యపెడుతుందని, సెప్టెంబర్ 30 వ తేదీలోపు ఈ పథకంలో NPS క్రింద నమోదైన ఉద్యోగులు చేరడానికి గడువు విధించిందని కానీ ఈ పథకంలో ఇప్పటి వరకు దేశవ్యాపితంగా కేవలం 33000 వేల మంది ఉద్యోగులు మాత్రమే చేరారాని, ఈ పథకం మరింత ఆర్థిక నష్టం ఉద్యోగి చేసే విధంగా ఉందని అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్ సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ యు మహేందర్, కామ్రేడ్ ఏ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. నేడు హుజురాబాద్ పోస్ట్ ఆఫీస్ లో పెన్షన్ విగ్రహ దినం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రభుత్వ ఉద్యోగికి ఆర్థిక, సామాజిక భద్రత ఇవ్వని, భరోసా లేని NPS-UPS పెన్షన్ పథకాలను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత, ఉద్యోగ విరమణ తర్వాత ప్రశాంత జీవనం అని ఎన్నో తరాలు నమ్మిన నిజం, ఇప్పుడు నిరాధారమైపోయిందని అన్నారు.
2004ఏప్రిల్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగం లో చేరిన వారంత కాంట్రిబ్యూటరీ పెన్షన్ పరిధిలో కి వచ్చారు. ఈ పథకం ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు హామీ ఇవ్వడం కంటే మరింత అనిచ్చితి, ఆందోళన, ఆర్థిక భారం మోపుతుందని రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఆసరా పెన్షన్ కంటే ఆధ్వన్నంగా ఉన్న NPS -UPS రద్దు కొరకై ఉద్యోగ లోకమంత పోరాటం చేయాలనీ తద్వారా పాత పెన్షన్ ను సాధించుకోవాలని సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సందర్బంగా నిరసన తెలుపుతూ కోరడం జరిగింది.

పెన్షన్ విద్రోహ దినం ” పాటిస్తున్న పోస్టల్ ఉద్యోగులు…
———-++++++++——————–
&&పత్రికా ప్రకటనలు&&
————-++++++———————-
##వార్షికోత్సవ శుభాకాంక్షలు##






