
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం, కమలపూర్ మండలం మర్రిపెల్లి గూడెం గ్రామంలో రెండు రోజుల క్రితం జనసేన పార్టీ క్రియశీలక సభ్యుడు జియఉద్దీన్ మరణించగా, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ RK సాగర్ సూచనల మేరకు ఈ రోజు వారి కుటుంబాన్ని ఆ పార్టీ నాయకులు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో శంకర్ గౌడ్ మరియు సాగర్ ఫోన్ లో మాట్లాడుతూ వారి కుటుంబానికి భరోసా ఇస్తూ, మీ యొక్క కుటుంబానికి జనసేన అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. అంతేకాకుండా క్రియాశీలక సభ్యత్వం ద్వారా వర్తించే 5 లక్షల రూపాయల ప్రమాద భీమా ఇన్సురెన్స్ అందేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు బైరగొని అరవింద్ గౌడ్, హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్, కరీంనగర్ నియోజకవర్గ నాయకులు న్యాంతాబాద్ జనార్ధన్, కమలాపూర్ మండల నాయకులు జిల్లాల మహేష్, ఇంగే శ్రీనివాస్, కుసుంబ సాంబ శివరాం, పోరండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.


జనసేన పార్టీ క్రియశీలక సభ్యుడు జియఉద్దీన్ మరణించగా ఆయన కుటుంబాన్నీ పరామర్శిస్తున్న జనసేన పార్టీ నాయకులు..
——————-++++++++++++————-
##పత్రికా ప్రకటనలు##
—————-+++++++———————
@@వార్షికోత్సవ శుభాకాంక్షలు@@






