
:స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జై తెలంగాణ అంటూ ప్రెస్మీట్లో మాట్లాడడం ఆరంభించిన కవిత.. బీఆర్ఎస్ నేతలపై మరోసారి మండిపడ్డారు. తనను బహిష్కరిస్తూ బీఆర్ఎస్ విడుదల చేసిన ప్రకటనను కవిత మరోసారి చదివి వినిపించారు.
పోరాటాలు చేస్తే వ్యతిరేక కార్యకలాపాలా: కవిత
తాను 5 నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చాక అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేశానని కవిత తెలిపారు. ‘గురుకులాల సమస్యలపై మొట్టమొదటి సారిగా గళమెత్తాను. బీసీలకు జరుగుతున్న అన్యాయం, 42 శాతం రిజర్వేషన్లపై పోరాటం చేశాను. మహిళలకు నెలకు రూ.2500, బనకచర్లపై రౌండ్ టేబుల్ పెట్టాను. ఇవి ఎలా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయో BRS పెద్దలు చెప్పాలి. బీసీల కోసం మాట్లాడితే నాపై దుష్ప్రచారం చేశారు’ అని విమర్శించారు.
ఎందుకు బాధ పడుతున్నావ్ చెల్లి అని ఫోన్ చేయవా: కవిత
తనకు అన్యాయం జరుగుతుందని చెప్పినా KTR ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు. ‘నేను మీ చెల్లిని. పార్టీ ఆఫీసులో కూర్చొని కొందరు నా మీద కుట్రలు చేస్తున్నారని చెబితే.. ఎందుకు బాధ పడుతున్నావ్ చెల్లి అని ఫోన్ చేయవా? రక్త సంబంధం పక్కన పెట్టండి. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను MLC. 103 రోజుల నుంచి ఒక్క మాట మాట్లాడారా. KCR బిడ్డ అయిన తనకే రెస్పాన్స్ రాలేదు. మిగతా మహిళల పరిస్థితేంటి’ అని నిలదీశారు.
ఆ ఎమ్మెల్యేలకు హరీష్ ఫండింగ్!
హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. ట్రబుల్ క్రియేటర్ అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్, BJP రెండు పార్టీలతో టచ్ లో ఉన్నాడని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో 20-25 ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశాడన్నారు. కాళేశ్వరం అవినీతితో వచ్చిన డబ్బులే ఇవన్నారు. MLAలకు ఫండింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింనద్నారు.
హరీశ్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్: కవిత
మాజీ మంత్రి హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన విమర్శలు చేశారు. హరీశ్‌రావు పెద్ద డ్రామా ఆర్టిస్టు అని విమర్శించింది. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు అదనపు ఫండింగ్ ఇచ్చారని ఆరోపించారు. హరీశ్ ట్రబుల్ షూటర్ కాదని… బబుల్ షూటర్ అని అన్నారు. సమస్యను తానే పరిష్కరించినట్లు హరీశ్ డ్రామా చేస్తారని ఆరోపించారు. వైఎస్సార్‌తో హరీశ్ చర్చలు జరిపింది నిజం కాదా అని ప్రశ్నించారు.
‘హరీశ్ రావు రేవంత్ రెడ్డి కాలు పట్టుకున్నారు…
మాజీ మంత్రి హరీశ్రరావుపై MLC కవిత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు ఒకే విమానంలో వెళ్లినపుడుతే.. BRS పార్టీపై, KCR ఫ్యామిలీపై కుట్రలు స్టార్ట్ అయ్యాయన్నారు. హరీశ్‌రావు రేవంత్ రెడ్డి కాలు పట్టుకున్నారని, అందుకే ఆయనను కేసుల నుంచి తప్పించి కేసీఆర్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. BRS నుంచి తనను సస్పెండ్ చేయడంపై కవిత స్పందిస్తూ..
నాన్న అన్నను కాపాడు: కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హరీశ్‌రావుతో ముప్పు పొంచి ఉందని కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు… బీఆర్ఎస్ మంచి కోరుకునే వారు కాదని అన్నారు. ఇప్పుడు నన్ను పార్టీ నుంచి బయటకు పంపారని.. రేపు కేటీఆర్‌కు కూడా అదే పరిస్థితి ఎదురు కావచ్చని అన్నారు. “నాన్న అన్నను కాపాడు” అంటూ కవిత కేసీఆర్‌కు సూచించారు.
రామన్నకు ప్రమాదం ఉంది: కవిత
BRS నుంచి తనను సస్పెన్సన్ చేయడంపై MLA కవిత తీవ్రంగా స్పందించారు. ‘ఆరడుగల బుల్లెట్టు ఇవాళ నాకు గాయం చేసింది. రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సరెండర్ అయ్యారు. అందుకే ఆయన డెయిరీ అక్రమాలు బయటకు రాలేదు. రిజల్ట్ అటు ఇటు అయితే తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతో హరీశ్ గేమ్ ఆడాలని చూశారు. సంతోషారావుతోనూ రేవంత్ రెడ్డికి మ్యాక్స్ ఫిక్సింగ్ జరిగింది.’ అని ఆరోపించా…
రేవంత్, హరీష్ ఫ్లైట్ జర్నీ.. కవిత సంచలన ఆరోపణలు!
రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే ఫ్లైట్‌లో జర్నీ చేసిన తర్వాతనే తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని కవిత ఆరోపించారు. ఆ ప్రయాణం జరిగిందో? లేదో? చెప్పాలని హరీష్, రేవంత్ ను డిమాండ్ చేశారు. తనకు ఎదురైన పరిస్థితి రేపు కేసీఆర్, కేటీఆర్ కు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు.
మా ముగ్గురిని ఓడించేందుకు హరీశ్ కుట్ర: కవిత
కాళేశ్వరం నుంచి వచ్చిన అవినీతి డబ్బులతో హరీశ్ కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. ‘2018లో 20-25మంది ఎమ్మెల్యేలకు హరీశ్ ఫండింగ్ చేశారు. అవి కాళేశ్వరం నుంచి వచ్చిన డబ్బులే. కొద్దిగా అటు ఇటు అయితే ఆయన దగ్గర ఎమ్మెల్యేలు ఉండాలనే ఆ కుట్ర చేశారు. ఆయనకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? 2009లో KTRను ఓడించేందుకు హరీశ్ రావు సిరిసిల్లకు రూ.60 లక్షలు పంపారు. KCR, కేటీఆర్, నన్ను ఓడించేందుకు ఆయన కుట్ర చేశారు’ అని ఆరోపించారు.
“ప్రభాస్ ను మోసం చేసిన సంతోష్ రావు”
బీఆర్ఎస్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ సంతోష్ రావు.. చిరంజీవి, ప్రభాస్‌లను కూడా మోసం చేశారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో చిరంజీవి, ప్రభాస్ వంటి సెలెబ్రెట్రీలతో మొక్కలు నాటించి… ఆ ఆడవినే కొట్టేయాలని చూశాడని తీవ్ర ఆరోపణలు చేశారు. సంతోష్ రావు కూరలో ఉప్పు, చెవిలో జోరీగా లాంటి వారని.. ప్రతీ పనిని చెడగొట్టడంలో ముందు ఉంటాడని విమర్శించారు.
రేపు కేసీఆర్, కేటీఆర్‌కూ నా పరిస్థితే – హరీష్‌దే కుట్ర : కవిత
హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. రేపు కేసీఆర్,కేటీఆర్ లను కూడా తన లాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని.. పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు.
కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కాం చేశారని.. ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకూ ఫండింగ్ చేశారని అన్నారు. కేటీఆర్ ను ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకు అరవై లక్షల రూపాయలు పంపించాడన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్‌లో వెళ్లారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు .. హరీష్ రావు పూర్తి స్థాయిలో సరెండర్ అయ్యారని.. హాస్టళ్లకు హరీష్ రావు డెయిరీ నుంచి పాలు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. అందరిపై కేసులు పెడుతూంటే.. ఒక్క హరీష్ పైనే ఎందుకు చిన్న కేసు కూడా పెట్టలేదని కవిత ప్రశ్నించారు.
కేసీఆర్ వెంట.. హరీష్ మొదటినుంచి లేరన్నారు. టీడీపీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తూంటే హరీష్ ఆపారని ఆరోపించారు. పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు హరీష్ రావు ..వైఎస్ ను కూడా కలిశారన్నారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదని…డబుల్ షూటర్ అని ఆరోపించారు.
కేసీఆర్, కేటీఆర్‌లకు హాని కలిగించే పనులు తాను చేయబోనని స్పష్టం చేశారు. ఎంతో నష్టం జరుగుతున్నా హరీష్ , సంతోష్‌లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నదే తన ఆవేదన అని చెప్పారు. సంతోష్ రావు వల్ల రామన్నకు చెడ్డపేరు వచ్చిందన్నారు. బంగారు తెలంగాణ అంటే హరీష్,సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. ఏ పని అయినా చెడగొట్టడానికే సంతోష్ రావు ఉంటారన్నారు. సంతోష్ రావు మోకిలాలో 750 కోట్ల ప్రాజెక్టును చేపట్టారన్నారు. గ్రీన్ ఇండియా పేరుతో నకిలీ కార్యక్రమం పెట్టి ఫారెస్ట్ ను కొట్టేయాలని కుట్ర చేశారన్నారు.


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కవిత..
—————+++++++———————-
##లోకల్ యాడ్స్##
————–+++++++———————-
&&వార్షికోత్సవ శుభాకాంక్షలు&&







