
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని బ్రహ్మకుమారి కల్పనా అక్కయ్య అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని బ్రహ్మకుమారి సెంటర్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారిలు కల్పన, శ్రీవాణి లు మాట్లాడుతూ.. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకే స్థానం ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను బ్రాహ్మతో పోల్చారని, గురువు విద్యార్థుల్లో చెడు ఆలోచనలను తొలగించి వారిని సన్మార్గంలో నడిపించే విధంగా కృషి చేయాలన్నారు. బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో విలువలను పెంపొందిస్తూ ఆలోచన విధానాల్లో మార్పు వచ్చే విధంగా ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రపంచంలో శాంతిని నెలకొల్పడం కోసం బ్రహ్మకుమారిస్ సంస్థ ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు.
సమాజంలో ఉపాధ్యాయులు ఒక మార్పు తీసుకురావాలి..
ఉపాధ్యాయులు సమాజంలో ఒక మార్పు తీసుకువచ్చి నూతన సమాజాన్ని నిర్మించాలన్నారు. ప్రస్తుత సమాజంలో ఎన్నో నైతిక చర్యలు చూస్తున్నామని, వాటిని అరికట్టేందుకు పాఠశాల నుండే బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో మెడిటేషన్ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక భావన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కృషిలో ఉపాధ్యాయులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రపంచంలోని అన్ని వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి గొప్పనైనది పవిత్రమైనదని అలాంటి వృత్తిలో పనిచేసేవారు భగవంతునితో సమానమని అన్నారు.
సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకే స్థానం ఉందని, గురువు విద్యార్థుల్లో చెడు ఆలోచనలను తొలగించి వారిని సన్మార్గంలో నడిపించే విధంగా కృషి చేయాలన్నారు.
విద్యార్థులకు ఆధ్యాత్మిక అంశాలు బోధించాలి..
ఉపాధ్యాయులు విద్యార్థులుకు పాఠ్యాంశాలతో పాటు కొంత ఆధ్యాత్మిక అంశాలను బోధించాలని కోరారు. సబ్జెక్టు లే కాదు జివితా పాఠాలు కూడా బోధించాలన్నారు. టీచర్ ఒక నిచ్చన లాంటి వారని, విద్యార్థుల ఎదుగుదలకు ఎంతో కృషి చేస్తారన్నారు. ఉపాధ్యాయులందరూ చిరునవ్వుతో విద్యార్థులకు ఒక హ్యూమన్ టచ్.. హ్యూమన్ కేర్ అనేది ఇస్తే దాంతో పిల్లలు చాలా మోటివేట్ అవుతారన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంతో బోధిస్తూ వారిని అభినందిస్తే ఎంతో ఆనందంగా ఉంటారన్నారు. ఈ పద్ధతి ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో మంచి మార్గంలో ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం అక్కడికి విచ్చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులను అంగన్వాడి టీచర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సెంటర్ ఇంచార్జ్ శ్రీ వాణి అక్కయ్య, ఈశ్వరయ్య, రాజయ్య, జ్యోతి రాణి, ట్రస్మా అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు, పి రవీందర్ రెడ్డి, బి రాజ్ కుమార్, పి కిరణ్ కుమార్, ఈశ్వరయ్య, రాజయ్య, ఏ.మహిపాల్ రెడ్డి, జ్యోతి రాణి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


ఉపాధ్యాయులను సత్కరిస్తున్న బ్రహ్మకుమారిలు….

మాట్లాడుతున్న బ్రహ్మకుమారి సెంటర్ ఇన్చార్జ్ ..

సన్మానం పొందిన ఉపాధ్యాయులతో బ్రహ్మకుమారీలు..





