
– జిల్లా వ్యాప్తంగా ప్రధాని మోదీకి చిత్రపటానికి పాలాభిషేకం…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ పేద, మధ్యతరగతి, రైతు, ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడం పట్ల బిజెపి శ్రేణులు సంబరాలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాలు చేపట్టి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. హుజురాబాద్ బిజెపి శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తీసుకుని ముందుకెళ్తోందన్నారు. తాజాగా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల ప్రతీ పేద, మధ్యతరగతి కుటుంబానికి నేరుగా లాభం చేకూరబోతుందని తెలిపారు. దినసరి అవసరాల వస్తువులు, గృహ వినియోగ వస్తువులపై ధరలు తగ్గడం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గనుందని, పండుగల సమయంలో పేద కుటుంబాలకు ఇది నిజమైన బహుమతి అన్నారు.
కాంగ్రెస్ పాలనలో పెరిగిన ధరలు, పెరిగిన పన్నుల భారం వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు మోదీ జీఎస్టీ సంస్కరణలు ఊరట కలిగిస్తున్నాయన్నారు.. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, పేదల అభ్యున్నతి పట్ల మోదీ ప్రభుత్వ నిబద్ధతకు నిలువుటద్దం లాంటిదన్నారు.
దసరా – బతుకమ్మ పండుగకు ముందే పేదలకు మోదీ గిఫ్ట్ ఇచ్చారని, పండుగలో పేద కుటుంబాలు కూడా సంతోషంగా కొనుగోలు చేయగలిగేలా జీఎస్టీ పన్నుల భారాన్ని తగ్గించడం హర్షనీయమన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, పేద కుటుంబాల రోజువారీ ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇంటికి అవసరమైన నూనె, పేస్టు, సబ్బు, షాంపూ, బేబీ డైపర్స్.. ఇలా అనేక నిత్యవసర వస్తువులన్నింటినీ 18 శాతంనుంచి కేవలం 5 శాతంకి తగ్గించడం శుభపరిణామం అన్నారు. దీంతో రోజువారీ అవసరాలపై ప్రజలకు భారీ ఉపశమనం లభించనుందన్నారు.
సెప్టెంబర్ 22 నుంచి నూతన జీఎస్టీ అమల్లోకి రానుందనన్నారు. రాబోయే దసరా దీపావళి పండుగకు మిఠాయిలు, బట్టలు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్ఇవన్నీ ఇక మరింత చౌకగా లభించనున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ నిజాయితీ గల పాలన వల్లే ఇది సాధ్యమని, మహిళలు, రైతులు, విద్యార్థులు, వ్యాపారులు అందరికీ లాభం జరగనుందని తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్యరంగానికి భారీ ఊరట లభించనుందని, ఆరోగ్య రంగంలో పేదలకు పెద్ద ఊరట కలిగించేలా జీఎస్టీ లో నిర్ణయాలు తీసుకున్నారని , హెల్త్ సెక్టార్ అవసరమయ్యే మందులు, పాలసీలు చాలా చౌక ధరలకే లభించనున్నాయన్నారు. ఇందులో ముఖ్యంగా హెల్త్ , లైఫ్ ఇన్స్యూరెన్స్ పై జీఎస్టీ 18 శాతం నుంచి నిల్ కి తీసుకువచ్చారని, ఇది గొప్ప పరిణామమన్నారు.
రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలిచేది మోదీ ప్రభుత్వమేనని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాలు రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా అనేక సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరేలా ఉన్నాయన్నారు. ఇప్పుడు వ్యవసాయ యంత్రాలు, కోత, విత్తనాల పరికరాలు, ఇవన్నీ 12శాతం నుంచి 5 శాతంకి తగించిందన్నారు. రైతు ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరిగేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అలాగేపేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించే మోదీ ప్రభుత్వ సంకల్పం తో ముందుకు కొనసాగుతుందని తెలిపారు.
మ్యాప్స్, పుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్సిల్స్, ఎరైజర్స్.. ఇటువంటివన్నింటిపై జీఎస్టీ మినహాయింపు లభించిందని తెలిపారు. విద్యార్థులపై భారమయ్యే పన్నులు తగ్గించి, విద్య ఖర్చులు తక్కువ చేశారన్నారు. మధ్యతరగతి కుటుంబాల కలల వాహనాలు ఇప్పుడు మరింత అందుబాటులో ఉండేలా.. సామాన్యుడి కలల వాహనాలు ఇక మరింత తక్కువ ధరకు లభించనున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్ హైబ్రిడ్ కార్లపై , త్రిచక్ర వాహనాలు, బైకులు, సరుకు వాహనాలు ల జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతం కు తగ్గించారనన్నారు. ఎలక్ట్రానిక్స్ వస్తువులు పరికరాలుమరింత చౌకగా లభించనున్నాయన్నారు.
ఇంటి సదుపాయాలు తక్కువ ధరలో అందేలా మోదీ ప్రభుత్వం జీఎస్టీ లో పెనుమార్పులు మార్పులు చేసిందన్నారు. ప్రాసెస్ రిఫార్మ్స్ –ఎం ఎస్ ఎం ఈ కి పెద్ద వరం లాంటిదని , ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ 3 రోజుల్లో జరగనుందని, సులభమైన రీఫండ్ సిస్టమ్, జీరో రేటెడ్ సప్లైలు జరిగి చిన్న వ్యాపారాలు, ఎం ఎస్ ఎం ఈ కి భారీగా ప్రయోజనం జరగనుందన్నారు. మోదీ పాలనలో ధరల భారం నుంచి ఉపశమనం ఉపశమనం లభించి అభివృద్ధి పతంలో దూసుకుపోతుందన్నారు
నీతి గల, నిజాయితీ గల మోదీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలపై పన్నుల భారం భారీగా తగ్గిందని, వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి బిజెపి జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో భారమైన పన్నులతో ప్రజలు అల్లాడిపోతున్నారని తెలిపారు. అటు తెలంగాణలోనూ, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రజలపై ట్యాక్స్‌లు విపరీతంగా వేస్తున్నారన్నారు. విద్యుత్ చార్జీలు పెంపు, ఇంధన ధరలు పెంపు, మద్యం ధరలు పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు, బస్సు చార్జీలు పెంపు ఇలా అన్నీ సామాన్యుడి జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, పెట్టుబడులు రావడం లేదనీ, పరిశ్రమలు కుదేలవుతున్నాయనీ, రైతులు–ఉద్యోగులు నిరాశ చెందుతున్నారనీ ఘాటుగా విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, పట్టణ నాయకులు నల్ల సుమన్, కొల్లిపాక శ్రీనివాస్, ఎండి అజార్, సబ్బని రమేష్, యాంసాని శశిధర్, బోరగాల సారయ్య, నరాల రాజశేఖర్, పడారి కొమరయ్య, మండల నాయకులు కొండల్ రెడ్డి, చైతన్యరెడ్డి, మర్రి రవీందర్, చీదురాల శ్రీనివాస్, లక్ష్మి, దేవరాజ్, పృథ్వీ, కరుణాకర్, ఒడ్నాల చంద్రిక, మోతే తిరుపతి, పోతుల సంజీవ్, నాంపల్లి సుమన్, కొడిమ్యాల పవన్, గుర్రం సంతోష్, కొలిపాక వెంకటేష్, రాపాక రాజు, యాట రాజేష్, గుడిపాటి కొండల్ రెడ్డి, ఆవుల సదయ్య, భాస్కర్ యాదవ్, సొల్లు సాల్మోహన్, తాళ్లపల్లి దేవేంద్ర, గరిగే శివకృష్ణ, డోరి ఐలయ్య, క్యాస వెంకటేష్, నీలం రవీందర్, గంధం అనిల్, తూర్పాటి రాజశేఖర్, తూర్పాటి సురేష్, తూర్పాటి రాజ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి…


మాట్లాడుతున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి…





