
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో మతసామరస్యం వెలివేరిసింది. హిందూ ముస్లిం భాయి భాయి అనీ మరోసారి రుజువు చేసే సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హుజురాబాద్ పట్టణంలోని హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గణపతి నిమర్జనం వేడుకలో భాగంగా తొమ్మిది రోజులపాటు ఆ గణపతి చేతిలో ఉన్న లడ్డును నిర్వాహకులు వేలం వేయాగా ఈ వేలం పాటలో ఇదే పట్టణానికి చెందిన ఎండి నవాబ్ సౌండ్స్ నిర్వాహకుడు అలీమ్ రూ.10,116 లకు లడ్డును దక్కించుకునీ తన మతసామరస్యాన్ని ప్రదర్శించారు. సుమారు 15 కిలోలకు పైన ఉండే లడ్డుని రూ. 10,116 కు దక్కించుకొని తన సంతోషాన్ని పంచుకోవడం హిందూ ముస్లిం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. గణపతి లడ్డు వేలం పాటలో పాల్గొని దక్కించుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అలీమ్ పేర్కొన్నారు.

వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న అలీమును శాలువాతో సత్కరించి నెత్తిన లడ్డు పెట్టి దీవిస్తున్న పురోహితుడు..

వేలంలో లడ్డును దక్కించుకుని నెత్తిన పెట్టుకొని ఆనందపడుతున్న ముస్లిం యువకుడు అలీం…





