
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు శుక్రవారం ఆస్పత్రి కాంట్రాక్టు సిబ్బంది సమ్మె చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ…ఆరు నెలలుగా కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు రాకపోవడం వారి కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సివిల్ హాస్పటల్ వర్కర్స్ అనారోగ్యానికి గురైన ప్రజలకు సేవలు అందించే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ప్రభుత్వం నిర్లక్యం చేయటం, సమయానికి జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు గురి చేయటం చాలా దుర్మార్గం అని అన్నారు. కాంట్రాక్టు సిబ్బంది సమ్మె చేస్తున్నడంతో స్పందించిన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి కాంట్రాక్టర్ తో మాట్లాడి మూడు నెలల జీతాలు సోమవారంలోగా అందించే ఏర్పాటు చేస్తామని కార్మికులకు స్పష్టం చేయడంతో వారు శాంతించి సమ్మె విరమించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, జిల్లా కమిటీ సభ్యులు కదిరే రమేష్, యూనియన్ నాయకులు రాజయ్య, స్వరూప, రాధ, అనిత, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.







