Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటర్ల జాబితా చర్చించడానికి ఈనెల 8న హుజురాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ మండల అభివృద్ధి అధికారి తూర్పాటి సునీత తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ… ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను శనివారం విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న వాటిని తెలియజేయాలని ఆమె కోరారు. సోమవారం జరగబోయే రాజకీయ పార్టీల నేతలతో సమావేశంలో అభ్యంతరాలను సూచనలను తెలియజేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు చేసే ప్రయత్నాలకు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎంపీఓ సతీష్ కుమార్, సూపరిండెంట్ వేణుగోపాల్, పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు.






