
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన కన్న ప్రతాప్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా స్థానిక హుజూరాబాద్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పంజాల అరవింద్ ద్వారా ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ వారి కుటుంబానికి అరవింద్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని పంపించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి ఏళ్ల వేళలా అండగా ఉంటానని వారి ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల అరవింద్, రాష్ట్ర SC సెల్ కన్వీనర్ ఇమ్మడి దయాకర్, హుజురాబాద్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ నాయకులు రంజిత్ రెడ్డి, సందీప్, కట్రపల్లి గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పెరుమాండ్ల భిక్షపతి, యువజన కాంగ్రెస్ నాయకులు అరకుటి విష్ణు, బాబాజీ నాగరాజు, సురేందర్, మిడిదొడ్డి అమర్, కాంగ్రెస్ నాయకులు ఓదేలు తదితరు పాల్గొన్నారు.



కన్న ప్రతాప్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి అనుచరులు, యువజన కాంగ్రెస్ నాయకులు..





