
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని రాధాస్వామి సత్సంగంలో జరిగిన ధ్యాన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్యానులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…మనిషి సకలం నేర్చుకోవడానికి భూమ్మీదకి వచ్చాడని తెలిపారు. ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చేయవచ్చని ,నిత్యం ధ్యాన సాధన చేయడంతో రోగాలు థరిచేరవని, ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని, మనల్ని మనం తెలుసుకోవడమే ధ్యానమని తెలిపారు. ఈ సందర్భంగా ధ్యాన గురువు అనిల్ ను పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన గురువు అనిల్ తో పాటు మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్..





