
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విదేశీవిద్య నిధులు బ్రాహ్మణ పరిషత్తుకు జమ చేయించినందుకు మంత్రి డి శ్రీధర్ బాబును బ్రాహ్మణ సంఘ ప్రతినితులు బుధవారం ఆయన చాంబర్లో కలిసి ఘనంగా సన్మానించారు. విదేశీ విద్య కోసం విదేశాలకు ఎంపికైన విద్యార్థులకు గత ప్రభుత్వము. మంజూరి పత్రాలు జనవరి 2023లో ఇచ్చారని, నేడు వారీ చదువు కూడా పూర్తి చేసుకున్నారు కానీ వాండ్లలో కొంత మందికి మాత్రమే డబ్బు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. పిల్లలను అప్పులు చేసి పంపిన తల్లిదండ్రులు అప్పులకు వడ్డీలు కట్టుకోలేక సతమత మవుతున్నారన్నారు. బ్రాహ్మణ పరిషత్తు చుట్టూ తిరిగినా ఫలితాము లేక పోయినదనీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కొన్ని బ్రాహ్మణ సంఘ నాయకులు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు మోరపెట్టుకోగా 2024- 2025 బడ్జెట్ లో 100 కోట్లు బ్రాహ్మనుల కోసం కేటాయించి అందులో విదేశీ విద్య కోసం 25 కోట్లు మంజూరి చేయించి బ్రాహ్మణ పరిషత్తుకు నిధులు జమచేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకి, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ, దార్మిక పరిషత్ అడ్వజర్ గోవింద హరి లను ఇట్టి నిధులు జమ కావటానికి ముఖ్య కారకులైన BOPWA అధ్యక్షులు సుశీల్ కుమార్, ప్రధాన కార్యదర్శి వింజమూరి సుధాకర్ కు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా బ్రాహ్మణ సేవ సమితి అధ్యక్షులు డాక్టర్. విష్ణుదాస్. గోపాల్ రావు, కార్యదర్శి సంపత్ కుమార్, ట్రెజరర్ చిట్టంపల్లి ఉపేందర్ రావు, జిల్లా కమిటీ కార్యావర్గం తమ హర్షాన్ని తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోనీ మంత్రి ఛాంబర్ లో సంఘ నాయకులు వింజమూరి సుధాకర్, సీతారామయ్య, విష్ణుదాసు గోపాల్ రావులు మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబుకు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.


మంత్రి దుద్దుల శ్రీధర్ బాబును కలిసి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా ప్రతినిధులు…





