Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ సెప్టెంబర్ 10:
మూత్రనాళము సమస్యలతో ఇబ్బంది పడుతున్న హుజూరాబాద్ పట్టణానికి చెందిన చెనుమల్ల ప్రసాద్ కు మానవతా దృక్పథంతో దాతలు ముందుకు వచ్చి బుధవారం ఆర్థిక సహాయం అందించారు. పట్టణంలోనీ ఎల్ఐసిలో చిరుద్యోగిగా పనిచేస్తున్న ప్రసాద్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న విషయాన్ని తెలుసుకున్న వారాహి ఫౌండేషన్ చైర్మన్ కూడికాల భాస్కర్ స్పందించి ఆయన అనారోగ్య దీన పరిస్థితిని గమనించి ఆయనకి 25 కిలోల రైస్ బ్యాగును అందించారు. ప్రసాద్ ను ఆదుకోవడానికి సహృదయులైన వారు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వారాహి డైరెక్టర్ చిలకమారి శ్రీనివాస్, డైరెక్టర్ జునుకుల లక్ష్మణరావు, పటేల్, బీసీ ఆజాద్ ఫెడరేషన్ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా తన సమస్య అనారోగ్య సమస్యలకు బాసటగా నిలిచిన దాతలకు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.






