
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమియాత్ ఉలమా వారి ఆధ్వర్యంలో వచ్చే నెల అక్టోబర్ 19వ తేదీన నిర్వహించే సీరత్ ఉన్ నబి ( మొహమ్మద్ ప్రవక్త) జీవిత చరిత్ర మీద పరీక్షలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. కావున ఇట్టి అవకాశాన్ని తల్లిదండ్రులు అందరు సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరించిన మస్జీద్ కమిటీ ప్రెసిడెంట్ మాహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు. ఈ కార్యక్రమంలో మదర్స దారులు ఉలూమ్ ప్రిన్సిపాల్ మౌలానా, షేక్ నయీమ్, జామియాత్ ఉలమా హుజురాబాద్ ప్రెసిడెంట్ హాఫిజ్ ఇమ్రాన్ బేగ్, ముఫ్తి షాకీర్ మౌలానా సోహెల్ , మస్జీద్ ఏ బషీర్ ప్రెసిడెంట్ షేక్ ఫయాజ్, జామియాత్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అమీర్, ముషూ, మురాద్ పాల్గొన్నారు.

వ్యాస రచన పోటీల పోస్టర్ ఆవిష్కరీస్తున్న మస్జీద్ కమిటీ ప్రెసిడెంట్ మాహమ్మద్ ముజాహిద్ హుస్సేన్…





