
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ జామే మజీద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సౌదీ అరేబియాలోని మక్కా ఉమ్రా ని దర్శించుకునేందుకు వెళ్తున్న సందర్భంగా బుధవారం రాత్రి ఆయన గృహంలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితెల ప్రణవ్ తరపున మైనారిటీ నాయకులు పూలమాలవేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే ముస్లిం మైనార్టీ నాయకులు, మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి వేరువేరుగా పూలమాలలు వేసి శాలువాలు కప్పి స్వీట్ తినిపించి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాడిపంటలతో పిల్లాపాపలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ అల్లాను ప్రార్థించాలన్నారు. ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారి అయినా మక్కాకి వెళ్లి రావాలని పెద్దలు చెబుతుంటారని, దర్శనానికి వెళ్తున్న ముజాహిద్ హుస్సేన్ కు దేవుడి కటాక్షం కలగాలని కోరుకున్నారు. అలాగే ఈ ప్రాంతంలోని మైనారిటీ సోదరుల తరఫున కూడా అక్కడ ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ పర్యటనకు వెళ్తున్న హుస్సేన్ క్షేమంగా వెళ్లి అందరి తరపున ప్రత్యేక ప్రార్థనలు చేసి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సోదరులు మొహమ్మద్ ఖాలీదు హుస్సేన్, మహమ్మద్ అలీమ్, మొహమ్మద్ తౌసిఫ్, మహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ ముఖిద్, మొహమ్మద్ సాదిక్, షేక్ జలీల్, మహమ్మద్ బార్బర్, మొహమ్మద్ అజ్జు లతోపాటు మక్బూల్ హుస్సేన్, మురాదు హుస్సేన్, ముష్, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితెల ప్రణవ్ తరపున మైనారిటీ నాయకులు పూలమాలవేసి శాలువాలు కప్పి ముజాహిద్ ను సత్కరిస్తున్న దృశ్యం..


ముజాహిద్ హుస్సేన్ ను శాలువాలు కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరిస్తున్న ముస్లిం మైనార్టీ నాయకులు, స్వర్ణోదయం ప్రతినిధి యాదగిరి..





