
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత 25 ఏళ్లుగా నేను ఎన్నో ప్రభుత్వాలు చూసాను కానీ ఇంతటి బాధ్యత రాహిత్యం గల ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాననీ మల్కాజ్గిర ఎంపీ, బిజెపి జాతీయ నాయకుడు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము మాటలకు చేతలకు పొంతనలేదనీ, అదరగొట్టి బ్రతుకుతున్నారన్నారు. గారెడి చేసి, మీడియా మేనేజ్ చేసి.. ఓవర్ లాపింగ్ టెక్నిక్ తో ప్రభుత్వాన్ని నెట్టుకు వస్తున్నారన్నారు. మీ డొల్లతనం ఇప్పటికే బయటపడిందనీ, గ్రామీణ ప్రజలకు కూడా తెలిసిపోయిందన్నారు.
విద్యార్థి లోకం బలిపీఠం ఎక్కినట్టు ఉందన్నారు. విద్యావ్యవస్థ ఖతం అయిపోతున్నట్టు ఉందనీ, 9 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విద్యార్థుల పరిస్థితి కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్టు ఉందన్నారు. మేధాశక్తిని చంపేస్తున్నారనీ, నిర్వీర్యం చేస్తున్నారు ఇది సరికాదు అన్నారు. రెసిడెన్షియల్ స్కూలలో విద్యార్థులు అస్వస్థకు గురవడానికి కారణం ప్రభుత్వమే అని, డైట్ చార్జీలు సకాలంలో చెల్లించడం లేదు అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఫీజు రియంబర్మెంట్ అందడం లేదన్నారు. గత రెండు సంవత్సరాలుగా కొత్త ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. సంవత్సరానికి దాదాపు 3 వేలకోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ఖర్చు అవుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లిస్తుందనీ అవి అందుతున్నాయి కానీ..గత నాలుగేళ్లుగా.. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాత్రం చెల్లించడం లేదు అని ఈటల ఆరోపించారు. 9 వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయన్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి విద్యార్థుల దగ్గరే ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తో చదువుకుంటున్నారని తల్లిదండ్రులు అనుకుంటే..
ఫీజులు కట్టాలనే పిడుగు లాంటి వార్త వల్ల వారు కట్టలేకపోతున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల పై చదువులకు వెళ్లాలి అనుకున్న విద్యార్థులు, విదేశాలకు వెళ్ళాలి అనుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనీ చెప్పారు.
దీనితో పాటు సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్ లలో డైట్ చార్జీలు 6 నెలలుగా ఇవ్వడం లేదన్నారు. దీనివల్ల ముదిరిపోయిన, పుచ్చు పట్టిన కూరగాయలు..కల్తీ సరుకులతో సరిగా అన్నం పెట్టక అనేక చోట్ల విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారనీ దీనికి కారణం ప్రభుత్వమే అని ఈటల పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలో ఫీజులు పెరిగాయని రెసిడెన్షియల్ స్కూల్స్ వేస్తే.. అక్కడ పరిస్థితితో ఆ తల్లిదండ్రులు కంటిమీద కొనుక్కు లేకుండా బ్రతుకుతున్నారనీ, ఎప్పుడు చెడు వార్త వినవలసి వస్తుందో అని బిక్కు బిక్కుమంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారనీ, చదువుకునే విద్యార్థులకు 5 లక్షల రూపాయలు కార్డు ఇస్తామన్నారనీ, బీసీలకు ప్రతి విద్యార్థికి మొత్తం ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నారనీ, కానీ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుగు పోయినట్టుగా విద్యార్థులు ఎవరికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అందడం లేదు అన్నారు. అంతేగాక మేధాశక్తిని చంపేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు ఇది సరికాదు అని ఈటల పేర్కొన్నారు. అనేకసార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేక.. గతిలేక గత్యంతరం లేక యాజమాన్యాలు కాలేజీలు బందు పెడతామన్నారన్నారు. ప్రభుత్వాలు మారినా పాత బకాయిలు కట్టాలి కదా అని అన్నారు. నేను గట్టిగా మాట్లాడితే ద్వేషిస్తున్నానని విమర్శిస్తున్నారనీ తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న వేదనను తొలగించాలన్నారు. వందల సంఖ్యలో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంబీఏ, ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయన్నారు. ఉన్న కాలేజీలు నడవడం లేదు, జీతాలు ఇవ్వలేకపోతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులతో పాటు యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి వచ్చిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో నలిగిపోతున్న విద్యార్థుల, కాలేజీ సిబ్బంది వేదన పట్టించుకోండి అని సీఎంకు సూచించారు. బేషజాలకు పోకుండా సమస్యను పరిష్కరించండి అని బిజెపి ఎంపీగా డిమాండ్ చేస్తున్నాను అని ఈటెల పేర్కొన్నారు. ప్రజల్లో ఉన్న అశాంతి ఊరికే పోదు అని, ప్రజల గుండెలు మండిపోతున్నాయన్నారు. పరిష్కారం చూపించకపోతే వారి ఆగ్రహానికి గురికాక తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
యూరియా కొరత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం.
ఒక సీజన్ కంటే ముందే డీడీలు కట్టాలి, ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి, గోదాములలో స్టాక్ పెట్టుకొని.. రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయాలి.
ఇవన్నీ చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం కదా అని అన్నారు. ఈ ప్రభుత్వానికి ముందు చూపులేదు, మానిటరింగ్ లేదు అని ఈటల పేర్కొన్నారు. ఎక్కువ పంట వేశారు అని అంటున్నారు..మంచి వర్షాలు పడినందుకు సంతోషపడాలి కానీ ..
చేయాల్సిన పని చేయకుండా కేంద్రాన్ని నిందించడం సరికాదు అన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది ఈ ప్రభుత్వం తీరు అని అన్నారు. రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడంలేదు అని, ఎక్కడ చూసినా యూరియాకు లైన్లు కడుతున్నారనీ, తెలంగాణకు వ్యవసాయం జీవనాధారం అని
రైతుల గోసపుచ్చుకోవద్దు అని రేవంత్ రెడ్డికి సూచించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న 500 రూపాయల బోనస్ ఇవ్వలేదు అన్నారు. ఈ ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతనలేదు అని
అదరగొట్టి బ్రతుకుతున్నారన్నారు. గారెడి చేసి మీడియా మేనేజ్ చేసి ఓవర్ లాపింగ్ టెక్నిక్ తో నెట్టుకు వస్తున్నారనీ, మీ డొల్లతనం ఇప్పటికే బయటపడిందనీ, గ్రామీణ ప్రజలకు కూడా తెలిసిపోయిందన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోవద్దు అని,
సమస్య వచ్చినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టడం లేదన్నారు. సలహాలు అక్కరలేదు అంటే నువ్వు అన్న చేయి..
నువ్వు చెయ్యవు సలహాలు తీసుకోకపోతే ఎలా అని ఈటల మండిపడ్డారు.
కవిత చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు..
నన్ను పంపించి బిఆర్ఎస్ వాళ్ళు ఏం సాధించారు,
ఎవరు పరిస్థితి ఏమయ్యిందో చూస్తున్నాం అని ఈటల పేర్కొన్నారు. భూలోకంలోని నరకాన్ని అనుభవించాను అని,
నన్ను పెట్టిన బాధ హుజురాబాద్ కు తెలిసినంతగా ఇంకెవరకు తెలుసు అని ఈటల పేర్కొన్నారు. 9 నెలలు ఎన్నికల కోసం కొట్లాడాను అని ఈటెల గుర్తు చేశారు.
గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగాయని కొన్ని వందలసార్లు నిరుద్యోగులు రోడ్లు ఎక్కారనీ, ఒక నిరుద్యోగి ఆరేళ్లు, పదేళ్లు.. అరటి పండ్లు తిని.. ఎండల్లో చెమటలు కక్కుకుంటూ చదువుకుంటారన్నారు. చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం జీవిత ఆశయం అని, కన్న తల్లిదండ్రుల అన్నం పెట్టాలని కష్టపడుతున్నారన్నారు. అలాంటప్పుడు ఒకటే పరీక్ష కేంద్రంలో వందమంది ఎంపికైతే మీ నిర్వహణ ఎట్లా ఉన్నట్లు, తప్పులు జరిగాయని చెప్పారు అయినా మీరు పట్టించుకోలేదు.. చివరికి కోర్టే రద్దు చేయమని చెప్పిందంటే మీ పద్ధతి ఎలా ఉందో చూడాలి అని పేర్కొన్నారు. ఆలోచన ఉంటే సరిపోదు ఆచరణ కూడా ఉండాలి అన్నారు. వందల ఉద్యోగుల కోసం లక్షల మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి కష్టపడి చదివి పరీక్ష రాస్తే చివరికి వచ్చిన వారికి కూడా తృప్తి లేకుండా పోయిందన్నారు. దీనికి కారణమైన దోషలను గుర్తించి శిక్షించాలి, మళ్లీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనీ ఈటెల డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయాలన్నారు. డిపార్ట్మెంట్ మౌలిక ఖాళీలు ప్రకటించి పరీక్షలు నిర్వహించండి అని ఈటెల సూచించారు. ఎక్కడ పోయినా అవుట్సోర్సింగ్ ఉద్యోగులే..వారికి కూడా ఎనిమిది నెలలుగా జీతాలు లేవు అని మండి పడ్డారు. గెస్ట్ లెక్చరర్లలకు ఆరు నెలలుగా జీతాలు లేవు అని వారికి ఆటోమేటిక్ గా రెన్యువల్ కావాలి,12 నెలల జీతాలు ఇవ్వాలని కొట్లాడాను అని ఈటెల తెలిపారు. 8 నెలలు జీతం ఇస్తే ఎలా బ్రతకాలనీ, వీరంతా మన బిడ్డలు అని మర్చిపోవద్దు అని ఈటల పేర్కొన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ, గౌతంరెడ్డి, బండి కళాధర్, వెంకట్ రెడ్డి, సంపత్ రావు, ముత్యంరావు, సురేందర్ రెడ్డి , తిరుపతి రెడ్డి, కరుణాకర్, సురేందర్ రాజు, సుదర్శన్ రెడ్డి, శ్రీరామ్ శ్యాం, తిరుపతి, కరుణాకర్, రత్నాకర్, సుమన్, ఎల్లగౌడు, కేసిరెడ్డి విజేందర్ రెడ్డి, యల్ల సంజీవరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ జాతీయ నాయకుడు ఈటెల రాజేందర్..






