
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఇటీవల కరీంనగర్ పట్టణంలో జరిగిన సౌత్ ఇండియా ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్ పోటీలలో గ్లోబల్ శోటో కాన్ కరాటే డో ఇండియా హుజురాబాద్ విద్యార్థులు ప్రతిభ ప్రతిభ కనబరచి బహుమతులు సాధించారని జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు, బ్లాక్ బెల్ట్ కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ…కరాటే పోటీలలో అండర్ 12 లో ఎస్కే షాదుల్ల బాబా సిల్వర్ మెడల్, అండర్ 13 లో సిహెచ్ సాయి చరణ్ గోల్డ్ మెడల్, అండర్ 9లో ఎండి.అబ్దుల్ అమాన్ సిల్వర్ మెడల్, అండర్ 9 అమ్మాయిల విభాగంలో ఎండి తస్లీమ్ సిల్వర్ మెడల్, అండర్ 14 లో జున్ను కావ్య ,ఓ సన్నిహిత లు బ్రాంచ్ మెడల్స్ . అండర్ 14 లో గౌసియా ఫాతిమా గోల్డ్ మెడల్ , అండర్ 7లో పి వేదాంశీ గోల్డ్ మెడల్ సాధించారని అన్నారు. కాగా బహుమతులు సాధించిన విద్యార్థులను టాప్రా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు కొలిపాక సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు ఉప్పు శ్రీనివాస్, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు ఎండి ఖలీద్ హుస్సేన్ లు అభినందించారు.

ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించిన కరాటే విద్యార్థులు..





