
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ/మండల శాఖ అధ్యక్షులు తూర్పాటి రాజు, రాముల కుమార్ ల ఆధ్వర్యంలో హుజురాబాద్ లోని డిసిఎంఎస్ కాంప్లెక్స్ లో బుధవారం ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి కొమరం భీమ్, కాళోజీ, వందేమాతరం రామచంద్ర రావు, దాసరథి, చాకలి ఐలమ్మ తదితరులు పోరాట ప్రతిమ ద్వారా నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మరేందరో ఉద్యమకారులు, కవులు, కళాకారులు, భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత సంవత్సరానికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఎడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మెడలు వంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగించిన సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నదన్నారు. పుట్టుక నీది చావు నీది జీవితమంతా దేశానిది అన్న కాలోజీ మాటలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


జాతీయ జెండా ఆవిష్కరించి నమస్కరిస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు…


ప్రభుత్వాసుపత్రిలో రక్తదానం నిర్వహిస్తున్న బిజెపి నాయకులు కార్యకర్తలు…
ప్రధాని మోడీకి దేశమే కుటుంబం ప్రజలే కుటుంబ సభ్యులు
భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ, మండల శాఖ అధ్యక్షులు తూర్పాటి రాజు మరియు రాముల కుమార్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రజా సేవే ప్రధమధర్మమని ఆచరించి చూపిన మహానేత, దేశం ముందు తర్వాత నేను అనే సంకల్పంతో ప్రతిక్షణం ప్రజలతోనే అన్న తపనతో గడిపిన సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అన్న నినాదం ఇచ్చి 140 కోట్ల ప్రజల హృదయాలను జయించి అనేక పథకాలు ముందుకు తెచ్చి భారత్ ను విశ్వగురు స్థానానికి తీసుకెళుతున్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని బుధవారం హుజురాబాద్ లో తులసి మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి హుజురాబాద్ లో రక్తదాన శిబిరం నిర్వహించి 76 యూనిట్లు ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో హాస్పీటల్ సూపరిండెంట్ నారాయణ రెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు కొమురయ్య, బిజెపి జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్, కార్యవర్గ సభ్యులు కార్యక్రమ కన్వీనర్ గంగిశెట్టి ప్రభాకర్, కార్యక్రమ మండల కన్వీనర్ ముప్పు మహేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు బిజెపి మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు మాజీ ఫ్లోర్ లీడర్ పైళ్ల వెంకటరెడ్డి, నల్ల సుమన్, పారిపెల్లి కొండాల్ రెడ్డి, నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, యాళ్ల సంజీవరెడ్డి, సబ్బని రమేష్, యాంసాని శశిధర్, అంకతి వాసు, నరేడ్ల చైతన్య రెడ్డి మరియు జిల్లా పదాధికారులు పట్టణ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.





