
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో బుధవారం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని ప్రజా పాలన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జాతీయ పతాకాలను ఎగురవేసి నివాళులర్పించారు. మున్సిపాలిటీలో కమిషనర్ కే సమ్మయ్య, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆంజనేయులు, రెవిన్యూ కార్యాలయంలో తహసిల్దార్ కనకయ్య, ఏరియా ఆసుపత్రిలో సూపర్డెంట్ నారాయణరెడ్డి, ఇతర ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఆయా ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లు జాతీయ జెండా ఆవిష్కరింపజేశారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మునిసిపల్ ఆధ్వర్యంలో కార్మికులు, సిబ్బంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.






ప్రజాపాలనకు సంబంధించిన వివిధ చిత్రాలు...







