
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
సేవాపక్షం అభయాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను బిజెపి మహిళా మోర్చా నాయకులు నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ బాలుర, బాలికల పాఠశాలలో చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు ఒడ్నాల చంద్రిక , పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, కన్వీనర్ గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, యాంసాని శశిధర్, నరాల రాజశేఖర్, సారయ్య, వెంకటేష్, భాగ్య, మంజుల, బాగ్య, అపర్ణ పావని ,భాగ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్న దృశ్యం..





