
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాథమటిక్స్ అతిథి అధ్యాపక పోస్టు ఖాళీగా ఉందని అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. ఇందిరాదేవి కోరారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులు, నెట్, సెట్, పీహెచ్ డి, బోధనలో అనుభవం ఉన్నవారికి వెయిటేజీ ఉంటుందని అన్నారు . అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 19 వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల లోపు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈ నెల 20 వ తేదీ ఉదయం 10 గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూ ఉందని ఒరిజినల్ సర్టిఫికెట్స్ లతో హాజరుకావాలని ఆమె అన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ హుజురాబాద్..





