
– సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ మైనారిటీ సోదరులు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఇప్పుడు మోక్షం లభిస్తుందని దానికి సహకరించిన ప్రణవ్ బాబు కు హుజూరాబాద్ నియోజకవర్గ మైనారిటీ సోదరులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలో సైదాపూర్ రోడ్డులో గల శాదిఖాన కమ్యూనిటీ హాల్ కి పది లక్షల రూపాయలు, హుజూరాబాద్ మండల పరిధిలోని కందుగుల కమ్యూనిటీ హాల్ కు పది లక్షలు, పెద్దపాపయ్యపల్లి కబరిస్తాన్ ప్రహరీ గోడకు అయిదు లక్షలు, వీణవంక మండలం చల్లూరు గ్రామంలో గల హసీర్ ఖానాకు నాలుగు లక్షలు అన్ని మొత్తం కలిపి 29 లక్షల విలువ చేసే నిధులను ఎస్డిఫ్ ఫండ్ ద్వారా ప్రణవ్ బాబు మంజూరు చేపించారని వారికి, జిల్లా మంత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రణవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇవ్వడమే కాకుండా వాటిని ఆచరణలో పెడుతున్నారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


షాదిఖానాకు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత ప్రణవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు..





