
– నిధులు మంజూరు చేపించిన ప్రణవ్ కి కృతజ్ఞతలు తెలిపి,పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు.
– హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా,జమ్మికుంట గాంధీ చౌక్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రణవ్ తోనే సాధ్యమని, అందులో భాగంగా హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు చెరొక 15 కోట్లు మొత్తం రూ.30 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో, జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో నగరాలకు ధీటుగా మున్సిపాలిటీలను తీర్చిదిద్దుతున్నామని ఇది కాంగ్రెస్ పార్టీ విధానమని, ఉప ఎన్నిక తర్వాత నిధులు మంజూరు కానీ హుజూరాబాద్ కు ప్రణవ్ నాయకత్వంలో నిధులు మంజూరు కావడం హర్షణీయమని, 3ఏళ్లు ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్ గా ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేదని ఇప్పుడు తీసుకొచ్చినట్టు మాట్లాడడం సిగ్గుచేటని, అంతలా నిధులు తీసుకొచ్చే విషయం ఉంటే ఫాం హౌస్ లో ఉన్న కేసీఆర్ ద్వారా ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి తీసుకొస్తా అన్న వెయ్యి కోట్లు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్, జమ్మికుంట పట్టణ, మండల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్ళు, బ్లాక్ కాంగ్రెస్, యూత్, యువజన కాంగ్రెస్, మైనారిటీ నాయకులు, సీనియర్ నాయకులు, బీసీ, ఎస్సీ సెల్, సేవాదళ్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రణవ్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..

జమ్మికుంట గాంధీ చౌక్ లో ప్రణవ్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..





