
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, సెప్టెంబర్ 27:తెలంగాణ పితామహుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా శనివారం హుజురాబాద్ లోని బస్ డిపోక్రాస్ రోడ్ వద్ద పద్మశాలి సేవా సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాయితీ, త్యాగం, సేవా భావానికి ప్రతీక అన్నారు. ఆయన తన జీవితమంతా స్వాతంత్రం కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం అంకితం చేశారన్నారు. మహాత్మా గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంలో గాంధీతో పాటుగా స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాక, తెలంగాణ ఉద్యమ పితామహుడిగా ఆయన చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచారని పేర్కొన్నారు. బాపూజీ ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి యువతకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చడం తెలంగాణ ప్రజల ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం నాయకులు, చేనేత సంఘం నాయకులు, కుల బాంధవులు, తదితరులు పాల్గొన్నారు.





కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించి, స్వీట్లు పంపిణీ చేసుకుంటున్న పద్మశాలి సంఘం నాయకులు, కుల బంధువులు..





