
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఈ నెల 30న అష్టమిరోజు శాస్త్ర ప్రకారం సద్దుల బతుకమ్మ జరపాలంటున్న కొందరు పండితులు, ఈ నెల 29న వేడుకలు జరపాలంటున్న మరికొందరు పండితులు, 9 రోజులే ప్రామాణికం..శాస్త్రం వర్తించదని వాదనలు, ఈ నెల 30న సద్దుల బతుకమ్మ అంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 30న(మంగళవారం) బతుకమ్మ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంది. ఇప్పటికే ఆ రోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బతుకమ్మ ఏరోజున జరుపుకోవాలన్న సందిగ్ధం చాలామందిలో ఉంది. కొన్ని చోట్ల సోమవారం హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం 29న నిర్వహించేందుకు హుజురాబాద్ గాయత్రి బ్రాహ్మణ సంఘం ప్రకటించడంతో ఈ ప్రాంత ప్రజలు సద్దుల బతుకమ్మకు సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనపటికీ రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ విషయంలో స్పష్టత లేకపోవడంతో రెండుసార్లు ఒక్కోచోట ఒక్కో రోజున అలాగే 29న కొందరు, 30న మరికొందరు వేరువేరుగా నిర్వహించేలా ఆయా ప్రాంతాల ప్రజలు సిద్ధమవడం కోస మెరుపు.


ఈనెల 29వ సోమవారం నిర్వహించుకోవాలని హుజరాబాద్ గాయత్రి బ్రాహ్మణ సంఘం ప్రకటించిన పత్రికా ప్రకటన.

ఈనెల 30న సదుల బతుకమ్మ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన జీవో కాఫీ..





