
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నుండి గత నెల 11వ తేదీ రోజున హుజురాబాద్ నుండి ఉమ్రా చేయడానికి బయలుదేరేటప్పుడు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు, ఇమాములు, మజీద్ కమిటీ అధ్యక్షులు, మజీద్ కమిటీ సభ్యులు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, ముస్లిం సోదరులు హిందూ సోదరులు ప్రతి ఒక్కరు నాకు కలిసి నాకు శాల్వాలతో పుష్పగుచ్చాలతో స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశరన్నారు. చాలామంది మిత్రులు బంధువులు మంచిగా వెళ్లి మళ్లీ ప్రశాంతత వాతావరణం తిరిగి రావాలని చాలా మంది కోరుకున్నారని, చాలా మంది ముస్లిం సోదరులు దువా చేశారన్నారు. క్షేమంగా వెళ్లి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు కూడా చాలామంది చేసినారు అల్లా దయవల్ల వెళ్లి మక్కా మదీనాలో తిరిగి ఉమ్రా ప్రశాంత వాతావరణంలో చేసుకున్నాను. అప్పుడు ఎవరు ఎవరి ఇంట్లో పెళ్ళికాని అమ్మాయిలు ఉన్నారో వారందరి పెళ్లిళ్లు కావాలని అల్లాతో దువా ప్రార్ధన చేసినాను అన్నారు. చాలామంది విద్యార్థులు చదువుకొని ఉన్న వారందరూ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు కంపెనీలలో అయినా వారికి ఉద్యోగాలు దొరకాలని అల్లాతో ప్రార్థన చేసినట్లూ మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. అందరూ క్షేమంగా ఉండాలని అనారోగ్యంతో ఉన్న వారందరూ ఆరోగ్యంగా కోలుకోవాలని అల్లాతో మక్కా మదీనాలో ప్రార్థనలు దువా చేసినాను అన్నారు. మదీనాలో జనాబ్ సల్లల్లాహు అలై సల్లం కు సలాం అందరి తరఫున చెప్పినాను, మరి మదీనాలో కూడా నమాజులు చదివి అందరి కొరకు అందరూ బాగుండాలని దువా చేస్తూ ప్రార్ధన చేసినట్లు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. మీ అందరి ప్రార్ధన వలన దువా చేయడం వలన నేను ప్రశాంత వాతావరణంలో మక్కా మదీనాలో ఉమ్రా చేసుకుని ఈరోజు ప్రశాంతంగా సౌత్ అరేబియా జిద్దా నుండి హుజురాబాద్ కు ప్రశాంతంగా తిరిగి వచ్చిన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ నా మంచి కోరుకొని ఎంతమంది నాకు సన్మానాలు మరియు నా కొరకు ప్రార్థనలు దువా చేసినారు వారి అందరికీ నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.

మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్





