Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ నెల 9 నుండి ప్రారంభమవుతున్న 1విడుత స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్ పత్రంలో వేసే ముందు చూసుకోవాల్సింది ఈ విధంగా ఉంది.
1) వయస్సు 21 సంవత్సరాలు నిండాలి
2) సంబధిత ఓటరు లిస్టులో ఓటరు గా నమోదై ఉండాలి.
3)SC/ST/BC వారైతే caste certificate జత పరచాలి.
4) డిపాజిట్ సొమ్ము కట్టాలి
5)నేర చరిత్ర,చర, స్తిర ఆస్తులు, విద్యార్హత లతో కూడిన అఫిడవిటీ ఇద్దరు సాక్ష్యాలతో సంతకం పెట్టించి ఇవ్వాలి.
6) ఎలక్షన్ expenditure maintain చేస్తానని declaration ఇవ్వాలి.
7) ఏ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారో నామినేషన్ పత్రంలో ముందే తెలపాలి, లేకపోతే పార్టీ B పారం ఇచ్చిన పార్టీ గుర్తు రాదు.
8) నామినేషన్ పత్రం లో ఎన్ని పార్టీ పేర్లైన రాయొచ్చు. ఏ పార్టీ B పారం ఇవ్వకపోతే స్వతంత్ర గుర్తు కేటాయిస్తారు.
9)ఏదైతే స్థానం నుంచి పోటి చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదకుడుగా ఉండాలి.
10) నామినేషన్ పత్రంలో:
A)PART1 లో ప్రతిపాదకుని సంతకం ఉండాలి
B)PART 2 లో అభ్యర్ధి సంతకం ఉండాలి.
C)PART 3 లొ కూడా అభ్యర్ధి సంతకం ఉండాలి.
D)PART 4 లో RO సంతకం ఉండాలి
E)PART 5(Rejected nominations reasons)లొ RO సంతకం ఉండాలి.
F)PART 6 (receipt ) లొ RO సంతకం ఉండాలి.
11) అఫిడవిటీ లో ఇద్దరు సాక్షుల సంతకం మరియు అభ్యర్థి సంతకం ఉండాలీ.
12) Expenditure declaration లో అభ్యర్ధి సంతకం ఉండాలి. అనంతరం నామినేషన్ దాఖలు చేయాలి.






