
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామంలో పోచమ్మ దేవాలయ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలు భక్తుల ప్రజల ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రార్థనల మధ్య బుధవారం ఘనంగా ముగిసాయి. సోమవారం నుండి ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు మొదటి రోజు హోమం, రెండవ రోజు చండీయాగం, కుంకుమ పూజలు వేద పండితులు నిర్వహించారు. చివరి రోజైన బుధవారం గ్రామంలో పండగ వాతావరణం నెలకొనగా పోచమ్మ బోనాలను సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. మహిళలు పోచమ్మ బోనాలను పురస్కరించుకొని తమ ఇండ్లను చక్కగా అలంకరించుకొని తలపై బోనాలను పెట్టుకొని పప్పు చప్పులతో బోనాలను నిర్వహించి పోచమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవ సందర్భంగా దేవాలయ పరిసర ప్రాంతాలను దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పందిర్లు వేసి చక్కగా అలంకరింపజేశారు. ఈ సందర్భంగా
మాజీ సర్పంచ్ తాటికొండ పుల్లాచారి మాట్లాడుతూ… ప్రజల సహకారంతో పోచమ్మ దేవత వార్షికోత్సవ వేడుకలను భక్తి భావంతో సాంప్రదాయ బద్దంగా వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. గ్రామ పోచమ్మ దేవతకు కోరిన కోరికలు తీర్చే దేవతగా పేరుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు డింగరి భాస్కర్, మణికంఠ, పృధ్వీరాజ్, కృష్ణమాచార్యులు, మాజీ సర్పంచ్ చందుపట్ల పరంధాములు, చందుపట్ల జనార్ధన్, తాటికొండ సందీప్, నిర్వహణ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


పోచమ్మ తల్లి ఆలయం…

గ్రామానికి స్వాగతం పలికే తోరణాన్ని అందంగా అలంకరిస్తున్న దృశ్యం..



ఘనంగా పోచమ్మ బోనాలను నిర్వహిస్తున్న దృశ్యాలు.




పోతిరెడ్డిపేట గ్రామంలో ఉన్న పోచమ్మ ఆలయంలో ఉన్న పోచమ్మ తల్లి విగ్రహం..





