
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, అక్టోబర్ 08: హుజురాబాద్ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి నిన్న సాయంత్రం మృతిచెందాడు. గత కొంతకాలంగా పట్టణ పరిధిలో భిక్షాటన చేస్తూ జీవించిన ఆ వ్యక్తి మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో కరీంనగర్ రోడ్డు లోని ఇందిరా నగర్ సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా, కొత్తపెళ్లికి వెళ్లే మార్గంలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ తూముల కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుజురాబాద్ పట్టణ సీఐ టి.కరుణాకర్ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు హుజురాబాద్ పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: పట్టణ సీఐ, హుజురాబాద్: 87126 70773, ఎస్ఐ, హుజురాబాద్: 87125 74726


హుజురాబాద్ఏ రియా ఆసుపత్రి మార్చూరీలో ఉంచిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం..





