
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వాకర్ సభ్యులకు, పట్టణ ప్రజలకు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ సురేష్, డాక్టర్ సురక్ష, వైద్య సిబ్బంది అనూష, హారిక శిబిరంలో పాల్గొని సుమారు 100కు పైగా ప్రజలకు ఉచితంగా బిపి, షుగర్ ఇతర పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూత్రాలు వివరించారు. వయసును బట్టి ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే హరిప్రసాద్ పేర్కొన్నారు. అనంతరం వైద్యులను వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎండి మతిన్, ఉపాధ్యక్షుడు మండల యాదగిరి, కోశాధికారి సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు, డైరెక్టర్లు, సలహాదారులు, వాకర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వాకర్స్ కు వైద్య పరీక్షలు చేస్తున్న మెడికవర్ ఆసుపత్రి వైద్యులు..


వైద్యుడు సురేష్ ను శాలువాతో సత్కరిస్తున్న వాకర్అసోసియేషన్ నాయకులు, సభ్యులు..





