Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
.తెలంగాణలో స్ధానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఆదరా బాదరగా చట్టబద్ధత లేకుండా జారీ చేసిన జీవో నెంబర్ 9 పూర్తిగా లోపభూయిష్టంగా ఉండి ప్రభుత్వం హైకోర్టులో అభాసు పాలైందని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ నాయకుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నే
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 ఆధారంగా స్ధానిక సంస్థల ఎన్నికలకు జారీ చేసిన నోటిఫికేషన్ ను నిలుపుదల చేస్తూ రాష్త్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు బుధవారం జారీ చేసిందన్నారు.
బీసీ ల జనాభా లెక్కల పై ప్రభుత్వం నియమించిన డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఎక్కడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని, ప్రభుత్వం సేకరించిన ఎంపరికల్ డాటా కూడా నిబద్ధతతో శాస్త్రీయంగా లేదని విమర్శల నెదుర్కుందన్నారు. బీసీల జనాభాను 2024 ప్రకారం సర్వే చేశామని చెబుతున్న ప్రభుత్వం ఎస్వీ ఎస్టి ల జనాభాను మాత్రం 2011 ప్రకారం పరిగణించామని ప్రభుత్వం చెబుతున్న వాదన సమంజసంగా లేదని అన్నారు. యితర వర్గాల జనాభా లెక్కలను కూడా స్పష్టంగా పేర్కొనలేదనారు.
మార్చిలోఆమోదించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నందున జూలైలో ఆర్డినెన్సు జారీ చేసి చిత్త శుద్ధి లేకుండా చట్ట బద్ధత లేని జీవో 9 ని ప్రభుత్వం ఆధారా బదరాగా ఎలా జారీ చేసిందని పోలాడి ప్రశ్నించారు. దీంతో తెలంగాణ సమాజంలో గందర గోలానికి తెర లేపారన్నారు. తాము బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ఓటు బ్యాంక్ రాజకీయాలతో కాకుండా అన్ని వర్గాల ప్రజలకు వివరించి బీసీల జనాభాకు అనుగుణంగా వారి మనోభావాలు దెబ్బతినకుండా చట్ట బద్దంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికుందని పోలాడి రామారావు అభిప్రాయ పడ్డారు.






