
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పనిచేస్తూ నెలవారి జీతములో నుండి ప్రతినెల జిపిఎఫ్ ఖాతాలో తన జీవితంలో నుండి కొన్ని డబ్బులు ప్రతినెల దాచుకోవటం జరుగుతుందనీ, అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చనే ఉద్దేశముతో ప్రతి ఉద్యోగి ప్రతినెల తన జీవితంలో నుండి నెలకు ఒక్కసారి జిపిఎఫ్ లో జమ చేసుకుంటున్నదున జిపిఎఫ్ పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ ఉపాధ్యాయులు కార్మికులు మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. కుటుంబంలో ఏదైనా అవసరము ఉన్నప్పుడు కానీ ఏ ఉద్యోగి అయినా ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు లేక పిల్లల చదువుల కొరకు పిల్లల పెళ్లిళ్ల కొరకు పిల్లలకు ఏదైనా వ్యాపారం చేయడానికి తల్లిదండ్రులు అనారోగ్యాలకు గురి అయినట్లు అయితే ఏదైనా ప్రవేట్ హాస్పటల్లో ట్రీట్మెంట్ కొరకు లేక నివాస స్థలము కొనుగోలు కొరకు నివాస స్థలము ఉన్నట్టయితే ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి అవసరానికి అవసరం ఉంటుందని అన్నారు. ప్రతినెల ప్రతి ఉద్యోగి జిపిఎఫ్ లో జమ చేసుకుంటారనీ, జమ చేసుకున్న డబ్బు ఎప్పుడైనా తీసుకోవచ్చు అని ఉద్దేశముతో జిపిఎఫ్ ఖాతాలో జమ చేసుకుంటారు అవసరం ఉన్నప్పుడు ఆ శాఖలో ఉన్న అధికారికి దరఖాస్తు పెట్టినట్లయితే వారు బిల్లు తయారు చేసి సబ్ ట్రెజరీకి పంపియటం వలన ప్రభుత్వ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయినట్లయితే ఆ ఉద్యోగి రెండో రోజు వెళ్లి ఆ డబ్బులను తీసుకొని అవసరాల నిమిత్తం వాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కానీ గత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్నో రకాల బిల్లులను పెండింగ్ పెట్టడం జరిగిందనీ, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా ఇప్పటివరకు మేము దాచుకున్న జిపిఎఫ్ డబ్బులు కూడా మంజూరు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ ఉపాధ్యాయులు కార్మికులు మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను వెంటనే మంజూరు చేయాలని రెండో వ పిఆర్ సి, జిపిఎఫ్ సలండర్లు లీవ్, మెడికల్ బిల్స్ పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక రకాల బిల్లులన్నిటిని వెంటనే మంజూరు చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న అన్ని క్యాటగిరిలకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన జిపిఎఫ్ బిల్లులను వెంటనే మంజూరు చేసి ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకోవాలని నెలలు గడుస్తున్నప్పటికీ జిపిఎఫ్ బిల్లు మంజూరు కాకపోవడం చాలా బాధాకరమైన విషయం అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు జోక్యం చేసుకొని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జిపిఎఫ్ అన్నిటిని వెంటనే మంజూరు చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.


మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ ఉపాధ్యాయులు కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్





