
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన ముంజాల గణేష్ అనే నిరుద్యోగ యువకుడు ఉపాధి కోసం వెళ్లి దురదృష్టవశాత్తు శనివారం ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… ఉపాధి కోసం హనుమకొండలోని ఒక ప్రైవేట్ విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద రోజువారీ కూలిగా పని చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నాడు. విధులు నిర్వహిస్తున్నప్పుడు కరెంటు స్తంభంపై నుండి జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కిడ్నీలు దెబ్బతినడంతో పాటు తలకు గాయాలు కావడంతో పరిస్థితి విషమించి రాత్రి మరణించాడు. మరణించిన గణేష్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ఏడాది క్రితం ఆయన తండ్రి కరెంట్ షాక్‌తో మృతి చెందగా, ఇప్పుడు కొడుకు కూడా అదే విధంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గణేష్‌కు తల్లి, ఒక అక్క, బావ ఉన్నారు. తండ్రి మరణంతోనే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం ఇప్పుడు గణేష్ మరణంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. ఒకే కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, బంధుమిత్రులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన అనంతరం అంత్యక్రియల కోసం స్వగ్రామం కాట్రపల్లికి తీసుకువచ్చారు. కడు పేదరిక కుటుంబమైన అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ముంజాల గణేష్

ముంజాల గణేష్(ఫైల్)





