
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: యునైటెడ్ పురం ఫర్ ఆర్.టి.ఐ కాంపెన్ తెలంగాణ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారోత్సవాలలో భాగంగా హుజురాబాద్ పట్టణంలోని టెట్రా హైస్కూల్ లో వారోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గూడూరు స్వామిరెడ్డి కేక్ కట్ చేయగా రౌండ్ టేబుల్ సమావేశం ఉద్యమకారుల, దరఖాస్తుదారుల, పౌరుల విస్తృత సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి వచ్చిన వ్యక్తులు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి పౌరుడు సమాచారం, పొందే హక్కు ఉందన్నారు. ప్రతి పౌర సమాచార అధికారి కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిందేనని, గత ప్రభుత్వం రాష్ట్రంలో సమచార హక్కు చట్టం-2005 అమలులో క్రమేణా నిర్లక్ష్యం వహించి ఈ యొక్క చట్టం అమలు చేయకుండా జిమ్మీక్కులు చేస్తూ….నిమ్మకు నీరేతినట్లుగా వ్యవహరించిందన్నారు. దీనికి గాను UF-RTI కాంపెయిన్ పౌర హక్కులు కోరుకునే ప్రజాస్వామ్య వాదులందరూ, మన రాష్ట్రంలో ఉన్న స్వచ్చంద ఉద్యమ సంస్తలన్ని ఐక్యంగా ప్రజలను చైతన్య పరుస్తూ…
వివిధ రూపాలలో పొరాటాలను ఉదృతంగా చేస్తూ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో గత BRS ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలను, సమాచార హక్కుచట్టం ద్వారా బయట పెడుతుంటే పరోక్షంగా, ప్రత్యక్షంగా మరియు మానసికంగా అధికారికంగా అనధికారికంగా ప్రజా ప్రయోజనాల కొరకు స.హ ఉద్యమ కార్యకర్తలు పోరాడుతున్న వారిపైన దాడులు చేశారన్నారు. కేవలం నేతి బీరకాయలో నెయ్యి ఉన్నదెంత నిజమో గత BRS ప్రభుత్వం అమలు చేయడంలో అదేవిధంగా ఉండి చివరకు రాష్ట్ర కమిషనర్ల లేకుండా చేసి ప్రజల చేతిలో ఓటమి పాలయింది అన్నారు.
గత BRS ప్రభుత్వం పాలన అనుభవం గురించి తమరికి ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు తమరి పాలన ప్రజలకు పారదర్శకంగా ఉండే విధంగా అధికార యంత్రాగం పౌరులకు జవాబుదారీగా ప్రభుత్వ పాలనలో బాగంగా తెలంగాణ రాష్ట్రంలో చట్టప్రకారం అర్హత కలిగిన కమిషనర్లను పూర్తిస్థాయిలో నియమించాలనీ, జోనల్ వారీగా కమిషనర్లను ఏర్పాటు చేయాలన్నారు. ( రాజకీయ ఉపాధిగా కాకుండా చూడాలి)
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 10వ తరగతిలో సమాచార హక్కు చట్టం సక్సెస్ స్టోరీనీ పార్యంశంగా పెట్టడం జరిగిందనీ, దానిని BRS ప్రభుత్వం తొలగించారన్నారు. అట్టి పార్యంశాన్ని తిరిగి మరల కొనసాగించాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం G.O Rt No.1185 General Administration(GPM&AR) Department, Dt.12.03.2013 ప్రకారం రాష్ట్రస్థాయిలో మరియు జిల్లాస్థాయిలో హైపవర్ కమిటీలు వేస్తూ సభ్యులను నియమించి చట్టం అమలుపై సమీక్ష సదస్సులు నిర్వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం అమలు అభివృద్ధికై వివిధ శాఖలకు 1% శాతం బడ్జెట్ కేటాయించాలనీ,
చట్టాన్ని అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అధికారులకు చట్టపరమైన శిక్షలను కటినతరం చేయాలన్నారు.
నిర్ణీత సమయంలో “PIO” సమాచారం ఇవ్వకుండా కాలయాపనతో ఆసమాచారం పొందడానికి రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (RTI Act-2005 Section 19(3)) వద్దకు వెళ్లినట్టు అయితే అందుకు సంబంధించిన దరఖాస్తుదారుని ప్రయణ ఖర్చులను ఆయా సంబంధించిన శాఖలు చెల్లించేటట్లు చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పై విషయాలలో జోక్యాం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముగల రాజిరెడ్డి, కంకణాల జనార్దన్ రెడ్డి, తులసి లక్ష్మణమూర్తి, సొల్లు బాబు, పసుల స్వామి, ముచ్చ సమ్మిరెడ్డి, గూడూరి చైతన్యరెడ్డి, సంద్యాల వెంకన్న, బెల్లి సతీష్, పానుగంటి కిరణ్, కాశిరెడ్డి మహేందర్ రెడ్డి, ఇరుమాళ్ళ సురేందర్ రెడ్డి, చిలుకమారి శ్రీనివాస్, దాట్ల ప్రభాకర్, కుడికాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

వారోత్సవాల సందర్భంగా కేక్ కట్ చేస్తున్న జిల్లా అధ్యక్షుడు స్వామి రెడ్డి…

వారోత్సవాల సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న స్వామిరెడ్డి…





