
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (ఇల్లందకుంట): ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏఐసీసీ, పిసిసి ,డిసిసి మరియు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అవగాహన పెంచేందుకు “ఓట్ చోరీ” పేరిట సంతకాల సేకరణ కార్యక్రమం, ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు పవిత్రమైన హక్కు ప్రజల ఓటుతోనే ప్రభుత్వం ఏర్పడుతుందనీ కానీ దేశంలో ఎన్నికల సమయంలో ఓట్లు చోరీ చేయడం, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరీకి వ్యతిరేంకంగా పోరాడుతున్నారన్నారు. ఓటు చోరీతో దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో దేశ ప్రజలను దయనీయమైన స్థితిలోకి నెడుతుందనీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజల ఓటు విలువను కాపాడే దిశగా మా పార్టీ ఈ అవగాహన కార్యక్రమం ప్రారంభించిందన్నారు.
మా లక్ష్యం ప్రతి ఓటరికి తన ఓటు విలువను గుర్తు చేయడం, దాన్ని కాపాడుకోవడం అన్నారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ఎన్నికలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగాలన్నారు. అందుకే “ఓటు చోరీ ఆపు – ప్రజాస్వామ్యాన్ని రక్షించు” అనే నినాదంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఈ అవగాహన సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందనీ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది కుమార్, నాయకులు కనుమల్ల సంపత్, వంగ రామకృష్ణ, మేష రాజయ్య, గోరుకుంట్ల స్వామి, మరి వీరారెడ్డి, మూడెడ్ల రమేష్, భోగం సాయిరాం, మేకల సురేష్, గుడిశాల పరమేశ్వర్, పెద్ది శివకుమార్, మారేపల్లి ప్రశాంత్, గొడుగు మానస, రేణిగుంట్ల రవీందర్, గూడెపు ఓదెలు, గంగారం మహేష్, భోగం చిరంజీవి, భోగం పృద్వి, జక్కు కుమార్, దంసాని తిరుపతి, రాజేందర్, బొమ్మిడి సతీష్, సప్పి రవి, మొగిలిపాక శ్రీనివాస్, బుర్ర విజయ్ కుమార్, పైడిపల్లి దేవేందర్, జంగం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఓట్ చోరీ” పేరిట సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ నాయకులు..


ఓట్ చోరీ” పేరిట సంతకాల సేకరణ కార్యక్రమం, ప్రదర్శనలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు…





