
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ హుజురాబాద్ మండల శాఖ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఈ ఎన్నికల నిర్వహణ అధికారిగా పి నాగమోహన్, నిర్వహణ అధికారులు జాలి మహేందర్ రెడ్డి, పి రామచంద్రరావు మరియు ఎన్నికల పరిశీలకులు బి నరేందర్ సమక్షంలో నిర్వహించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హుజురాబాద్ యూనిట్ శాఖ ప్రెసిడెంట్ గా ఎండి ఉస్మాన్ పాషా, సెక్రటరీ జీ జయవర్ధన్, ఫైనాన్స్ సెక్రటరీగా కే దుర్గాజీ, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ గా లక్ష్మయ్య, వైస్ ప్రెసిడెంట్ గా ఏ ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్ గా చారు దత్తు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి రాజయ్య, జాయింట్ సెక్రటరీగా జె రామిరెడ్డి, పబ్లిసిటీ సెక్రటరీ మాడిశెట్టి నరసయ్య, డిస్ట్రిక్ట్ కౌన్సిలర్స్ గా పి. లక్ష్మీనారాయణ, పి. గణపతి రెడ్డి, కె శ్రీహరి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు.


అసోసియేషన్ అధ్యక్షులుగా ఎండి ఉస్మాన్ పాషా ఎన్నిక కాగా నియామక పత్రం అందజేస్తున్న ఎన్నికల అధికారులు..

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేస్తున్న ఎన్నికల నిర్వహణ కమిటీ నాయకులు..





