Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ముగ్గురు వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా చెక్కులు ఇచ్చి అవి బౌన్స్ కావడంతో కేసు విచారణ జరిపిన
హుజురాబాద్ ఫస్ట్అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి పద్మ సాయిశ్రీ చాడ కొండాల్ రెడ్డి అనే వ్యక్తికి శుక్రవారం రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధించింది. ప్రభుత్వ సహాయ న్యాయవాది కేతిరి శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారo…..సైదాపూర్ మండలం దుద్దేనపల్లి గ్రామానికి చెందిన చాడ కొండాల్ రెడ్డి అనే వ్యక్తి, హుజురాబాద్ మండలం పెద్దపాపాయ్యపల్లెకు చెందిన పోరెడ్డి విజేందర్ రెడ్డి వద్ద 8.20 లక్షలు, రావుల తిరుపతి రెడ్డి వద్ద 5 లక్షలు , రావుల సమ్మిరెడ్డి 8 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, సొమ్ముకు సంబంధించి చెక్కులు జారీ చేశారు.
ఆ చెక్కులు చెక్కులు బ్యాంకు అకౌంట్లో డబ్బులు లేక బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితులు 2018 లో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వాదోపవాదాలు అనంతరం వెంకటరెడ్డి నేరాన్ని న్యాయమూర్తి ధ్రువీకరించారు. ముద్దాయికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5 వేల చొప్పున జరిమానా విధించారు. ఫిర్యాదుదారులు ఇచ్చిన అప్పు సొమ్ముకు రెట్టింపు చెల్లించాలని, అలాగే కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశించారు.






