
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
మల్కాజ్గిరి ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆయన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వ్యక్తులపై సోమవారం బిజెపి నాయకులు హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పీఏగా పనిచేస్తున్న భోగం అజయ్, మాట్ల రాజ్ కుమార్, జవ్వాజు కుమారస్వామి, దాంసాని కుమార్, పొన్నగంటి సంపత్, ఎడ్ల రమేష్, తాళ్లపల్లి మహేష్ గౌడ్ లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారని వారిపై చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మండల సాయిబాబా, పోతుల సంజీవ్, నల్ల సుమన్, అంకతీ వాసు, తిరుపతి, అయితే సందీప్, ఎండి మురాద్, శివ, రాజ్ కుమార్, ప్రవీణ్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

ఈటెలపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న బిజెపి నాయకులు..





