
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన చినుమల్ల ప్రసాద్(52)స్థానిక ఎల్ఐసి ఆఫీసులో తాత్కాలిక చిరు ఉద్యోగిగా పనిచేస్తు, దీర్ఘ కాలికాలికంగా మూత్ర నాలాల వ్యాధితో బాధపడుతున్నాడు. తన వ్యాధికి భారీ ఖర్చుతో కూడుకున్న వైద్యం అయినందున కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాడనీ స్థానిక పివీ సేవా సమితి సభ్యులు విషయాన్ని తెలుసుకొని బుధవారం నిత్యవసర వస్తువులు, కొంత నగదును బల్దియా కమిషనర్ కే సమ్మయ్య చేతుల మీదుగా వారి కుటుంబానికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారినీ ఆదుకోవడం కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పీవి స్వచ్ఛంద సేవ సమితి సభ్యులు ప్రసాదును ముందుకు వచ్చి అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు.
ఎల్ఐసి డిఓ దేవసింగ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు జీవిత బీమా సంస్థలో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. కుటుంబ యజమానికి జరగరానిది ఆపద జరిగిన సందర్భంలో బీమా వారి కుటుంబానికి అండగా ఉంటుందని ప్రజలకు సూచించారు. ప్రతి వ్యక్తి జీవిత బీమా చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పివి సేవాసమితి అధ్యక్ష, కార్యదర్శులు తూము వెంకటరెడ్డి, బి మనోజ్, తెలంగాణ బీసీ సిటిజన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, ప్రధాన కార్యదర్శి సందేళ వెంకన్న, ఎమ్మార్పీఎస్ నాయకులు రుద్రారపు రామచంద్రం, పద్మశాలి నాయకులు చిలకమారి శ్రీనివాస్, శివమణి, కాసర్ల శ్రీహరి, నమశ్శివాయ, మాజీ సర్పంచి పంజాల సుధాకర్, నమిండ్ల రవి, తునికి వసంత్, గౌరీ శంకర్, వేల్పుల ప్రభాకర్, శారద, మధు తదితరులు పాల్గొన్నారు.


మూత్ర నాలాల వ్యాధితో బాధపడుతున్న చినుమల్ల ప్రసాద్ కు నిత్యవసర సరుకులు, నగదు అందజేస్తున్న పీవీ సేవా సమితి నాయకులు ఇతర సంఘన నాయకులు..





