
–పాల్గొన్న హుజూరాబాద్ నియోజకవర్గ, సైదాపూర్, చిగురుమామిడి కాంగ్రెస్ నాయకులు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశంలో కాంగ్రెస్ పార్టీ నూతన ఒరవడిని తీసుకొచ్చిందని ఏఐసిసి జిల్లా అబ్జర్వర్, కర్ణాటక రాష్ట్ర హంగల్ శాసన సభ్యుడు మానే శ్రీనివాస్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ప్రతాప సాయిరెడ్డి ఫంక్షన్ హాల్ లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మానకొండూర్ శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, టీపీసీసి పరిశీలకులు మ్యాడం బాలకృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతాని కంటే బిన్నంగా ఈ సారి జిల్లా అధ్యక్షుల ఎంపికను వార్డు, గ్రామం, మండల, నియోజక వర్గ స్థాయి నాయకుల అభిప్రాయాలు తీసుకొని జిల్లా అధ్యక్షున్నీ ఎన్నుకోవడం జరుగుతుందని, దేశంలోనీ ఐదు రాష్ట్రాల్లో పూర్తి చేసుకొని దక్షిణ భారతదేశంలోనీ తెలంగాణకు ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని తెలిపారు. జిల్లాల వారిగా పరిశీలకులు నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నమని, ప్రజల మధ్య ఉండి ప్రజలతో మమేకమయ్యే నాయకులకు అవకాశం దక్కుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్షులకే కాదు మండల నాయకులను కూడా ఇదే విధంగా ఎన్నుకుంటామని తెలిపారు. క్రింది స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ఉంటే రానున్న ఇలాంటి ఎన్నికల్లో అయినా బలం పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గంలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మీడియాతో మాట్లాడుతున్న ఏఐసిసి జిల్లా అబ్జర్వర్, కర్ణాటక రాష్ట్ర హంగల్ శాసన సభ్యుడు మానే శ్రీనివాస్

మాట్లాడుతున్న ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ


పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు

మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్





