Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రోడ్డు ప్రమాదాల తోపాటు, ఎలాంటి విపత్కర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి 108 ద్వారా సత్వర సేవలు అందుతాయని 108 అంబులెన్స్ ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్ అన్నారు. శనివారం ఆయన హుజురాబాద్లో 108 వాహనాల సిబ్బంది సేవలను తనిఖీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ….హుజురాబాద్ డివిజన్లోని 108 వాహన సిబ్బంది సేవలను, రికార్డులను ఆయన పరిశీలించారు. వారి సేవలపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎంఈ సయ్యద్ ఇమ్రాన్, ఈఎంటి అజీముద్దీన్, పైలట్ స్వామి తదితరులు పాల్గొన్నారు.



108 అంబులెన్స్ ను పరిశీలిస్తున్న ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్





