
– రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– వర్షాకాలం సంబంధించి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు ఉంటుందని అంచనా..
– రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (కమలాపూర్): వర్షాకాలం సీజన్ కు సంబంధించి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసిందని, దానికి తగ్గట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం కమలాపూర్ మండల పరిధిలోని ఉప్పల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉందని, దళారులను నమ్మి మోసపోవద్దని, వర్షాకాలం సంబంధించి టార్ఫాలిన్ కవర్లు, బార్దాన్ సంచలను సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు సూచనలు చేశామని తెలిపారు. సోమవారం నుండి పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని, దానికి అనుకూలంగా మిల్లర్లతో కూడా మాట్లాడామని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేశిని ఐలయ్యగౌడ్, డైరెక్టర్లు సముద్రాల కృష్ణ, గట్టు శ్రీధర్, జనగాని శివకృష్ణ, ఓరుసు తిరుపతి, ఆకినపల్లి బిక్షపతి, చకిలం దయాకర్, మిల్కూరి శ్రీనివాస్, నిగ్గుల లింగయ్య, యాకూబ్ పాషా, కిన్నెర కృష్ణమూర్తి కాంగ్రెస్ నాయకులు బాలసాని రమేష్, పుల్లూరు శ్రీనివాసరావు, బొల్లం రాజిరెడ్డి, తడక శ్రీకాంత్, డాక్టర్ మౌటం కుమారస్వామి, మాట్ల రమేష్, పోడేటి బిక్షపతి, చెరిపల్లి రామచంద్రం పుల్ల శోభన్, దూడ శ్రీకాంత్, పోరండ్ల రమేష్ పల్లె సమ్మిరెడ్డి అనిల్ మారేపల్లి మహేష్, పాక చంద్రమౌళి, మొండెద్దుల నాగరాజు శనిగరపు రమేష్, మాట్ల రాజేష్ మార్కెట్ కార్యదర్శి జన్ను యాకయ్య మార్కెట్, ఐకెపి సిబ్బంది, రైతులు, హమాలీ సంఘం, ఉప్పల్ గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీరాణి రవీందర్



కొనుగోలు కేంద్రం ప్రారంభించి ధాన్యం జోకుతున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..





