Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని కొత్తపల్లి నాగేంద్రస్వామి దేవాలయంలో శనివారం నాగుల చవితి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నాగుల చవితిని పురస్కరించుకొని దేవాలయ ఆవరణలో భక్తుల కోసం ఆలయ ప్రధాన పూజారి పందిళ్ళ భాస్కర్ శర్మ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హుజురాబాద్ పట్టణం తో పటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుండి దేవాలయంకు వచ్చి పుట్టలో పాలు పోసి, నాగేంద్రుడికి నవరసాభిషేకము, పంచామృతాలతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని భక్తులు వేడుకున్నారు. అనంతరం భక్తులకు పేద పండితుడు, పూజారి భాస్కర్ శర్మ తీర్థ ప్రసాదములను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








